TSRTC: అయోమయంలో టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు

టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదించినా గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో ఇంకా చట్టంగా మారలేదు.

Updated : 23 Aug 2023 08:24 IST

కరీంనగర్‌ రవాణా విభాగం, న్యూస్‌టుడే: టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదించినా గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో ఇంకా చట్టంగా మారలేదు. ఈ బిల్లుపై ఆమె పలు సందేహాలు వ్యక్తం చేయడంతోపాటు న్యాయసలహా కోరారు. ఆర్టీసీలో 183 మంది ఉద్యోగులు ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. బిల్లు ఆమోదం పొందితే.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (ప్రస్తుతం 60 ఏళ్లు) ఇతర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 61 కానుంది. ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయాల్సిన వారు మరో ఏడాదిపాటు కొనసాగవచ్చు. ఉద్యోగ భద్రతతోపాటు గ్రాట్యుటీ, పీఎఫ్‌ తదితర ప్రయోజనాలూ అందుతాయి. కానీ ఇప్పటివరకు విధివిధానాలు రాకపోవడంతో ఆ 183 మంది అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉద్యోగులు 3 వేర్వేరు చట్టాల కింద పనిచేస్తున్నారు. మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యాక్ట్‌ కింద డ్రైవర్లు, కండక్టర్లు.. ఫ్యాక్టరీస్‌ చట్టం కింద మెయింటెనెన్స్‌ సిబ్బంది.. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ కింద ఇతర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభిస్తే వీరంతా ప్రభుత్వోద్యోగులుగా మారుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని