Mulugu: ములుగు జిల్లాలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ.. ఆశ్చర్యంలో జనం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు ఖాతాల్లో శనివారం రూ.వేలల్లో డబ్బులు జమయ్యాయి.

Updated : 27 Aug 2023 08:57 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు ఖాతాల్లో శనివారం రూ.వేలల్లో డబ్బులు జమయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి మొదలుకొని రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.లక్ష వరకు జమయ్యాయి. ఖాతాలో డబ్బులు పడినట్లు చరవాణికి సందేశం రాగానే కొందరు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వివిధ మార్గాల ద్వారా ఇతర ఖాతాలకు వెంటనే బదిలీ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏటూరునాగారంలోని ఎస్బీఐ, పీఎన్‌బీ, ఏపీజీవీబీ, కెనరా.. ఇలా పలు బ్యాంకుల ఖాతాదారులున్నారు. బ్యాంకర్లు పొరపాటున డబ్బులు వేశారేమో అనుకున్నా... శనివారం బ్యాంకులన్నీ బంద్‌ కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకుని ఇంటెలిజెన్స్‌ వర్గాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు