Khammam: అమెరికాలో కత్తిపోట్లు.. విషమంగానే ఖమ్మం విద్యార్థి ఆరోగ్యం

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

Updated : 03 Nov 2023 07:39 IST

వాషింగ్‌టన్‌: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న వరుణ్‌రాజ్‌ ఆదివారం పబ్లిక్‌ జిమ్‌ నుంచి తిరిగొస్తుండగా జోర్డాన్‌ ఆండ్రేడ్‌ అనే వ్యక్తి కత్తితో కణతలో పొడిచిన విషయం విదితమే. దాడికి గల కారణాలను పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. లూథరన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్‌ ఇంకా కోమాలోనే ఉన్నాడు. అతన్ని లైఫ్‌సపోర్టుపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా వరుణ్‌రాజ్‌ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) గోఫండ్‌లో విరాళాల సేకరణ ప్రారంభించింది. బుధవారం రాత్రి వరకు 38 వేల డాలర్లు సమకూరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని