Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.

Updated : 29 Nov 2023 08:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1సెం.మీ.లు, నిజామాబాద్‌ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15సెం.మీ.ల వర్షాపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని