JEE Main: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు గడువు రేపే

2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది.

Updated : 29 Nov 2023 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: 2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్‌(JEE Main) తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌-2023 తొలి విడత పేపర్‌-1కు(బీటెక్‌లో ప్రవేశానికి) 8.60 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని