స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది.

Updated : 29 Nov 2023 04:18 IST

రేపు రజత్‌కుమార్‌ పదవీ విరమణ

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది. దీంతోపాటు పునరావాసం, భూసేకరణ విభాగ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించింది. రజత్‌కుమార్‌ పర్యవేక్షించిన అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి అప్పగించింది.

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అనిల్‌ జైన్‌

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నూతన కమిటీని కేంద్రం నియమించింది. కేంద్ర జల సంఘంలో డిజైన్స్‌ సీఈ (వాయవ్య, దక్షిణ మండల) అనిల్‌ జైన్‌ను ఛైర్మన్‌గా, జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌, నవీన్‌ కుమార్‌, ఎస్కే సిబల్‌లను సభ్యులుగా నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని