సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం

సినిమా థియేటర్‌ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్‌ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Published : 30 Nov 2023 02:37 IST

ఈఎస్‌ఐసీ కేసులో లొంగిపోవటం నుంచి మినహాయింపు

 దిల్లీ: సినిమా థియేటర్‌ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్‌ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం లేకుండా రక్షణ కల్పించాలన్న జయప్రద, సహనిందితుని పిటిషన్లను జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌ ధర్మాసనం అనుమతించింది. నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు బుధవారం ధర్మాసనం సూచించింది. థియేటర్‌ కార్మికులు దాఖలు చేసిన కేసులో ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జయప్రదకు, సహనిందితునికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. దీనికి గాను నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. శిక్షను రద్దు చేసేందుకు హైకోర్టు తిరస్కరించడంతో నిందితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు