పాస్‌పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు

పాస్‌పోర్టు పెండింగ్‌ దరఖాస్తుల విచారణ అపాయింట్‌మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 30 Nov 2023 03:23 IST

అందుబాటులోకి పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: పాస్‌పోర్టు పెండింగ్‌ దరఖాస్తుల విచారణ అపాయింట్‌మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 125 వాక్‌ ఇన్‌, మరో 125 ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లను విడుదల చేయగా ఇకపై వాటిని పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వాక్‌ ఇన్‌ విధానం ద్వారా క్యూలైన్‌లో రద్దీ పెరిగిపోతోందని, సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో అన్‌లైన్‌ ప్రక్రియను ప్రారంభించామన్నారు. సోమ, మంగళ, శుక్రవారాలు రోజూ 250 ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లను టైమ్‌స్లాట్‌ ఆధారంగా విడుదల చేస్తామని తెలిపారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతాయని ఎలాంటి ఫీజు చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం ఒక్కరోజు మాత్రమే అత్యవసరమైన వారి కోసం వాక్‌ఇన్‌ అపాయింట్‌మెంట్‌ సేవలు అందిస్తామని వెల్లడించారు. విచారణ అపాయింట్‌మెంట్లు ఇప్పిస్తామంటూ వచ్చే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని