ఆర్‌జీయూకేటీకి గ్రీన్‌ యూనివర్సిటీ పురస్కారం

బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్‌ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది.

Published : 30 Nov 2023 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్‌ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) ఆధ్వర్యంలో 28వ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌) సమావేశాన్ని నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబరు 12 వరకు దుబాయిలో నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలో సుమారు 72 ఎకరాల్లో మొక్కలు పెంచడం, ఎకో పార్క్‌ ఏర్పాటు, కాలుష్య నివారణ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీ తెలంగాణ రాష్ట్రం నుంచి ‘గ్రీన్‌ యూనివర్సిటీ అవార్డు-2023’కు ఎంపికైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ డిసెంబరు 1వ తేదీన దుబాయిలో ఈ అవార్డును అందుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని