తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు

తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది.

Published : 30 Nov 2023 03:28 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. సదరు ఓటరు ఈపీఐసీ (ఎలక్షన్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు)తో దరఖాస్తు చేసుకుంటేనే వారు వేతనంతో కూడిన సెలవుకు అర్హులవుతారని బుధవారం ప్రకటనలో పేర్కొంది.

 కర్మాగారాల సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర కర్మాగారాలశాఖ డైరెక్టర్‌ బి.రాజగోపాలరావు యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు