Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది.

Updated : 01 Dec 2023 07:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో పనిచేసేవారు కూడా పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టింది. దీంతో హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గురువారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కిటకిటలాడే దుకాణాలు, హోటళ్లు మూతపడగా.. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి. కనీసం టిఫిన్‌ సెంటర్లు కూడా తెరుచుకోలేదు. ఒకట్రెండు తెరిచినా టీ మాత్రమే విక్రయించారు. దీంతో నిరుద్యోగులు, బ్రహ్మచారులు, పోలింగ్‌ సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు వచ్చినవారు ఆకలితో నకనకలాడారు. పలు జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాలపై అల్పాహారం, భోజనం విక్రయించేవారికి మంచి గిరాకీ లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని