Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Updated : 01 Dec 2023 08:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌-తిరుపతి (07482) రైలు డిసెంబరు 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం; హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం; నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం; కాకినాడ-లింగంపల్లి (07445) డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో; లింగంపల్లి-కాకినాడ (07446) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయల్దేరతాయి. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని