Hyderabad: మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్‌ తరలింపు!

మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేషీ నుంచి ఫర్నిచర్‌ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది.

Updated : 07 Dec 2023 07:34 IST

అడ్డుకున్న ఓయూ ఐకాస

నారాయణగూడ, న్యూస్‌టుడే: మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేషీ నుంచి ఫర్నిచర్‌ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. నంబరు లేని వాహనంలో ఫర్నిచర్‌, కంప్యూటర్లు, పలు దస్త్రాలను తరలిస్తున్న సమయంలో రవీంద్రభారతికి వచ్చిన ఓయూ గిరిజన శక్తి అధ్యక్షుడు శరత్‌, నాయకులు ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పిన మాట ప్రకారం గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళుతున్నామని సుధీర్‌ అనే వ్యక్తి సమాధానమివ్వగా సీఎస్‌ ఆదేశాలకు భిన్నంగా ఎలా చేస్తారంటూ తరలింపును అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి ఏపీ 11ఏఆర్‌4921 కారులో వెళ్లిపోయారు. ఈ విషయమై భాషా సాంస్కృతిక శాఖ అధికారులను ప్రశ్నించగా తమకే సమాచారం లేదని చెప్పడం కొసమెరుపు. దీనిపై శరత్‌ స్థానిక సైఫాబాద్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని