జనవరిలో రాష్ట్రానికి ఈసీ బృందం

లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది.

Updated : 07 Dec 2023 04:59 IST

లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది. 2024 ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటి నిర్వహణకు అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించనున్నారు. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తం అవుతోంది. సాధారణంగా షెడ్యూలు ప్రకటనకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రధాన కమిషనర్‌తోపాటు మిగిలిన కమిషనర్లు, ఉన్నతాధికారులు రాష్ట్రానికి వచ్చి ఎన్నికల సన్నద్ధతను అధ్యయనం చేస్తారు. అంతకు ముందు రెండు దఫాలు అధికారుల స్థాయిలో సమీక్షలు జరుగుతాయని ఉన్నతాధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని