Revanth Reddy: రేవంత్‌ ఇంటికి నిరంతర విద్యుత్తు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది.

Updated : 07 Dec 2023 07:57 IST

రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది. సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజినీర్లను ఆదేశించింది. రేవంత్‌రెడ్డి ఇంటికి గతంలో జూబ్లీహిల్స్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్తు సరఫరా అయ్యేది. ఆ వ్యవస్థలో సమస్య తలెత్తినా సరఫరా ఆగకుండా చూసే క్రమంలో ఇంజినీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోడ్‌ నంబరు 22లోని సబ్‌స్టేషన్‌ నుంచీ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. ఆయా పనులు బుధవారం నాటికి పూర్తయ్యాయి.

గజ్వేల్‌ మాదిరి కరెంట్‌

రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో విద్యుత్తు సరఫరాపైనా కార్పొరేట్‌ కార్యాలయం బుధవారం సమీక్షించింది. సీఎంగా కేసీఆర్‌ ఉన్నప్పుడు  ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ తరహాలో కొడంగల్‌ నియోజకవర్గంలోనూ సరఫరా మెరుగ్గా ఉండాలని ఉన్నతాధికారులు సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని