‘జలశక్తి’ సమావేశాన్ని వాయిదా వేయండి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో శుక్రవారం ఏపీ, తెలంగాణలతో జలశక్తి శాఖ దిల్లీలో నిర్వహించే సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి కేంద్రాన్ని కోరారు.

Published : 08 Dec 2023 04:57 IST

ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎస్‌ శాంతికుమారి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో శుక్రవారం ఏపీ, తెలంగాణలతో జలశక్తి శాఖ దిల్లీలో నిర్వహించే సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆమె జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని, మంత్రి మండలి సమావేశాలు, ఇతర ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమై ఉందని తెలిపారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని