విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకుడిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

తెలంగాణ విద్యుత్తు వర్కర్స్‌ యూనియన్‌(బి-2871) రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగరాజు సస్పెన్షన్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎత్తివేసింది.

Published : 08 Dec 2023 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్తు వర్కర్స్‌ యూనియన్‌(బి-2871) రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగరాజు సస్పెన్షన్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎత్తివేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ సైఫాబాద్‌ డివిజన్‌ పరిధిలోని సైఫాబాద్‌ సెక్షన్‌ గ్రేడ్‌ 3 ఆర్టిజన్‌గా తిరిగి పోస్టింగ్‌ ఇస్తూ సర్కిల్‌ ఎస్‌ఈ పి.బ్రహ్మం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాగరాజు.. రాష్ట్రం వచ్చిన తర్వాత సంస్థలో జరుగుతున్న లోపాలను సామాజిక మాధ్యమాల వేదికగా ఎత్తిచూపడంతోపాటు డైరెక్టర్లపై పలు ఆరోపణలు చేశారు. దీంతో క్రమశిక్షణ చర్యలో భాగంగా 2021లో నాగరాజును సస్పెండ్‌ చేశారు. సాధారణంగా 6 నెలల వరకు సస్పెన్షన్‌ వర్తిస్తుంది. ఆరు నెలల అనంతరం తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని పలుమార్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ ట్రాన్స్‌కో యాజమాన్యాలను అభ్యర్థించినా స్పందన కరవైంది. ఎట్టకేలకు రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని గంటల్లోనే నాగరాజు సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని