కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బోర్గాం(పి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

Published : 08 Dec 2023 04:58 IST

బోర్గాం(పి)(మోపాల్‌), న్యూస్‌టుడే: కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బోర్గాం(పి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన కొంత సమయానికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా, మరికొందరు కడుపు నొప్పితో బాధపడ్డారు. ఉపాధ్యాయులు అప్రమత్తమై సమీపంలోని వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి వారిని 108 అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు అక్కడ చికిత్స పొందుతున్నారు. పాఠశాలకు ఎంఈవో రామారావు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు తాగిన నీరు, ఆహార శాంపిళ్లను సేకరించారు. వాటిని పరీక్షించిన తర్వాత అస్వస్థతకు గల కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని