కళాశాలల్లో స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులు

డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది.

Updated : 08 Dec 2023 05:07 IST

27 కోర్సులను గుర్తించిన యూజీసీ
మార్గదర్శకాల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగార్థుల్లో కొలువులకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమల వర్గాలు గత కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో.. ఒకేషనల్‌ విద్యను జనరల్‌ విద్యతో మిళితం చేయాలని జాతీయ నూతన విద్యా విధానంలోనే నిర్ణయించారు. ఈ క్రమంలో యూజీసీ శరవేగంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటర్‌ పాసై డిగ్రీ, బీటెక్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరిన వారు ఈ కోర్సులకు అర్హులు. తొలుత యూజీసీ 3-6 నెలల కాలవ్యవధి ఉన్న 27 రకాల నైపుణ్య కోర్సులను కూడా గుర్తించింది. వాటితోపాటు సీఐఐ, ఎఫ్‌ఐఐ, నాస్కామ్‌, పరిశ్రమవర్గాలు, సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు తదితర కోర్సులను కూడా ప్రారంభించుకోవచ్చు. ఇందుకు యూజీసీ అనుమతి అవసరం లేదు. కాకపోతే ఆ కోర్సుల్లో నైపుణ్యమున్న సంస్థలు, పరిశ్రమలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. స్వల్పకాల కోర్సులకు కూడా క్రెడిట్లు ఇస్తారు. 12-30 క్రెడిట్ల వరకు ఉంటాయి. ఒక కోర్సుకు సంబంధించిన సెక్షన్‌లో 60 మందికి మించి ఉండరాదు. ప్రతి 30 మందికి ఒక టీచర్‌ ఉండాలి. ఈ కోర్సులను నడిపేందుకు సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సెస్‌ పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి అధిపతిగా ఒక సీనియర్‌ అధ్యాపకుడిని నియమించుకోవాలి.

గుర్తించినవి ఇవే...

1. ఏఐ అండ్‌ ఎంఎల్‌ 2. ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ 3. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ( ఐఓటీ)/ ఇండస్ట్రియల్‌ ఐఓటీ/స్మార్ట్‌ సిటీస్‌ 4. డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ 5. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 6. వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ అండ్‌ ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ 7. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ 8. 5జీ కనెక్టివిటీ 9. డిజిటల్‌ ఫ్లూయెన్సీ/డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ 10. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ 11. ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్స్‌/ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్స్‌ 12. ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ 13.బేసిక్‌ కోడింగ్‌ ఇన్‌ కంప్యూటింగ్‌ లాంగ్వేజెస్‌ 14. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌(క్యాడ్‌) 15. మెకానికల్‌ టూలింగ్‌ అండ్‌ ప్రాసెసెస్‌/మెకట్రానిక్స్‌ 16. ఆర్కిటెక్చురల్‌ డ్రాఫ్టింగ్‌, బేసిక్‌ 3డీ డిజైన్‌ 17.బిల్డింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ మోడలింగ్‌ 18. 3డీ ప్రింటింగ్‌ 19. ఎలక్ట్రీషియన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 20.మొబైల్‌ కమ్యూనికేషన్‌, మొబైల్‌ రిపేరింగ్‌ అండ్‌ బేసిక్స్‌ ఆఫ్‌ డీటీహెచ్‌ ఇన్‌స్టాలేషన్‌ 21.డిజిటల్‌ మార్కెటింగ్‌ 22. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ 23. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌టెక్‌) 24.ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ తదితరాలు 25. యోగిక్‌ సైన్సెస్‌ 26. సాఫ్ట్‌ స్కిల్స్‌ 27. బేసిక్స్‌ ఆఫ్‌ స్టార్టప్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని