జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా

ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే జనవరి అయిదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల ప్రక్షాళన వ్యవహారాలను అధికారులు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది.

Published : 08 Dec 2023 05:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే జనవరి అయిదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల ప్రక్షాళన వ్యవహారాలను అధికారులు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. అందుకు అనుగుణంగా జనవరి ఆరో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల కోసం జనవరి ఆరో తేదీ నుంచి 22వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ తుది ఓటర్ల జాబితాను  ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు ఒకటో తేదీలను ప్రామాణికంగా తీసుకుని కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటు నమోదు కోసం https://voters.eci.gov.inలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని