Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ

తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు.

Updated : 09 Dec 2023 07:03 IST

లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు(Anganwadi Vacancy) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్‌వాడీ వర్కర్స్‌, 7,038 హెల్పర్‌ పోస్టులు(Anganwadi jobs) ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మనుషులను తరలించే నకిలీ ఏజెంట్లు తెలంగాణలో 113 మంది, ఏపీలో 471 మంది ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గత అక్టోబర్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 2,925 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌లో వారి పేర్లను వెల్లడించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని