TSRTC: మన బస్సులు ఫుల్‌.. మహారాష్ట్రవి నిల్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకానికి క్షేత్రస్థాయిలో స్పందన లభిస్తోంది. బస్సులన్నీ అతివలతో నిండిపోతున్నాయి.

Updated : 12 Dec 2023 09:58 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సుల్లో (TSRTC) మహిళలకు ఉచిత పథకానికి క్షేత్రస్థాయిలో స్పందన లభిస్తోంది. బస్సులన్నీ అతివలతో నిండిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో నిత్యం పదుల సంఖ్యలో ఆ రాష్ట్ర బస్సులు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఆ రాష్ట్ర బస్సుల్లో ఎవరూ ఎక్కడం లేదు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌ డిపోకు చెందిన బస్సు నిత్యం నిజామాబాద్‌కు రెండుసార్లు తిరుగుతుంది. ఒక్కో ట్రిప్పునకు రూ.15 వేల కలెక్షన్‌ వచ్చేది. కానీ గత మూడు రోజులుగా రూ.6 నుంచి 7 వేలు మాత్రమే వస్తున్నాయని ఈ డబ్బులు డీజిల్‌కు కూడా సరిపోవని కండక్టర్‌, డ్రైవర్‌ వాపోతున్నారు.       

ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు