Seethakka: మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు

మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు.

Updated : 14 Dec 2023 08:16 IST

జగ్గన్నపేట మార్గంలో సర్వే చేసిన అధికారులు

ములుగు, న్యూస్‌టుడే: మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడవటం లేదని ఈ నెల 12న ‘ఈనాడు’ ములుగు జిల్లా పత్రికలో ‘పల్లెకు రాదు బస్సు.. మహాలక్ష్మికి లేదు చోటు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రోడ్డు రవాణా శాఖ అధికారులు రూట్‌ సర్వే చేశారు. ఈ విషయంపై వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఆ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించేందుకు సర్వే చేశారని.. త్వరలో బస్సు నడిపిస్తామని తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్‌ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని