TSRTC: అరుణాచల పుణ్యక్షేత్రానికి సూపర్‌ లగ్జరీ బస్సులు

పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన అరుణాచలానికి పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబరు 26న సూపర్‌ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 18 Dec 2023 07:47 IST

బేగంబజార్‌, న్యూస్‌టుడే: పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన అరుణాచలానికి (Arunachalesvara Temple) పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబరు 26న సూపర్‌ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 రాత్రి 8 గంటలకు ఎంజీబీఎస్‌ నుంచి బస్సు బయల్దేరి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి దర్శనం, వేలూరులోని స్వర్ణదేవాలయ సందర్శన అనంతరం 25 రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 26న గిరి ప్రదక్షిణ అనంతరం 27న ఎంజీబీఎస్‌కు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికీ ఛార్జీ రూ.3690 ఉంటుందన్నారు. ఈ టూర్‌ వివరాలు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. భక్తులు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, జంట నగరాల్లోని సమీప ఆర్టీసీ కేంద్రాల వద్ద టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226257, 9959224911, 9959226246 నంబర్లను సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని