Kavitha: నేటి విచారణకు కవిత హాజరవరు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట భారత రాష్ట్ర సమితి(భారాస) ఎమ్మెల్సీ కవిత హాజరుకావడం లేదు. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాదులు ఈడీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Updated : 17 Jan 2024 06:35 IST

ఈడీకి ఆమె తరఫు న్యాయవాదుల లేఖ!

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట భారత రాష్ట్ర సమితి(భారాస) ఎమ్మెల్సీ కవిత హాజరుకావడం లేదు. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాదులు ఈడీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో పాత్రపై విచారించేందుకు గతంలో పలుమార్లు ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతరత్రా అవకాశాలు ఉన్నప్పటికీ ఒక మహిళను విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 5న ఈడీ మరోమారు కవితకు నోటీసులు జారీ చేసి ఈ నెల 17న(బుధవారం) దిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఒక పక్క న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగా మళ్లీ నోటీసులు జారీ చేయడం సరికాదని, విచారణకు కవిత హాజరుకారని ఆమె తరఫు న్యాయవాదులు ఈడీకి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని