23న మేడారానికి గవర్నర్‌, సీఎం

వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొనేందుకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 23న మేడారం రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

Published : 12 Feb 2024 02:51 IST

రాష్ట్రపతి కూడా వచ్చే అవకాశం
మంత్రి సీతక్క

తాడ్వాయి, న్యూస్‌టుడే: వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొనేందుకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 23న మేడారం రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ఆమె ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్‌లతో కలిసి మేడారంలో ఏర్పాట్లను పరిశీలించారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మహాజాతరకు ఈసారి ముందస్తుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్తు, పుణ్యస్నానాల ఏర్పాట్లు పూర్తి చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో సర్వీసులు పెంచాం. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి గవర్నర్‌, సీఎంతోపాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని