ఉదయం 11:40 గంటలు.. పల్చగా సిబ్బంది హాజరు!

సమయం ఉదయం 11:40 గంటలు అవుతున్నా అధికారులు, సిబ్బంది హాజరు పల్చగా ఉండడంపై రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 23 Feb 2024 03:41 IST

సచివాలయ రెవెన్యూ విభాగంలో మంత్రి పొంగులేటి తనిఖీలు..
నిర్లక్ష్యంపై అసంతృప్తి..

ఈనాడు, హైదరాబాద్‌: సమయం ఉదయం 11:40 గంటలు అవుతున్నా అధికారులు, సిబ్బంది హాజరు పల్చగా ఉండడంపై రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం రెవెన్యూ విభాగానికి చెందిన ఐదు సెక్షన్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొంతమంది ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి రాకపోవడం, మరికొంత మంది సమయానికి హాజరుకాకపోవడాన్ని మంత్రి గుర్తించారు. హాజరు పట్టికలను తనిఖీ చేశారు. గైర్హాజరుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధులను అలక్ష్యం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో రెవెన్యూశాఖ కీలకపాత్ర పోషిస్తుందని, ఇతర విభాగాలకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు, సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించి నిజాయతీ, నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని