సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం: మంత్రి రాజనర్సింహ

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు.

Published : 23 Feb 2024 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, డీఎంఈలు వాణి, శివరాం ప్రసాద్‌, రహదారులు, భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. వరంగల్‌లో 2,100 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఆల్వాల్‌లో నిర్మిస్తున్న 1,200 పడకల టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, 1000 పడకల ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌, ఈఎస్‌ఐ వద్ద నిర్మిస్తున్న మరో వెయ్యి పడకల టిమ్స్‌, నిమ్స్‌లో మరో 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆసుపత్రుల భవనాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వైద్యసేవల నిమిత్తం వచ్చే రోగులకు అందించే చికిత్సలపై సాంకేతిక కమిటీని నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని