మత్తుమందుల నివారణకు బహుముఖ వ్యూహం: జూపల్లి

రాష్ట్రంలో మత్తుమందులను అరికట్టేందుకు బహుముఖ వ్యూహం అనుసరించాలని ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

Published : 23 Feb 2024 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మత్తుమందులను అరికట్టేందుకు బహుముఖ వ్యూహం అనుసరించాలని ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం డైరీని గురువారం ఆయన తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తుమందుల నియంత్రణకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలన్నారు. మద్యం అక్రమ రవాణాను కూడా అడ్డుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జె.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.విజయ్‌, కోశాధికారి డి.శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని