చట్టాన్ని అనుసరించే విధులు నిర్వహించాలి

పోలీసులు అనునిత్యం చట్టాన్ని అనుసరించి విధులు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో స్టైపెండరీ కేడెట్‌ ట్రైనింగ్‌ పోలీసు కానిస్టేబుల్‌(ఎస్‌సీటీపీసీ)ల ఇండక్షన్‌ శిక్షణ కోర్సు గురువారం ప్రారంభమైంది.

Published : 23 Feb 2024 03:43 IST

డీజీపీ రవి గుప్తా

నార్సింగి న్యూస్‌టుడే: పోలీసులు అనునిత్యం చట్టాన్ని అనుసరించి విధులు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో స్టైపెండరీ కేడెట్‌ ట్రైనింగ్‌ పోలీసు కానిస్టేబుల్‌(ఎస్‌సీటీపీసీ)ల ఇండక్షన్‌ శిక్షణ కోర్సు గురువారం ప్రారంభమైంది. తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో సివిల్‌ 550 మంది, ఏఆర్‌ విభాగంలో 135 మొత్తం 685 మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యూనిఫాం ధరించి సమాజానికి సేవ చేయడం గర్వంగా భావించాలన్నారు. ఈ శిక్షణ పొందుతున్న వారిలో 200 మంది కేడెట్లకు కంప్యూటర్‌ నేపథ్యం కలిగి ఉండటం అభినందనీయమని, సైబర్‌ క్రైం అరికట్టడంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, అదే సమయంలో నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిష్త్‌ మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా శిక్షణ పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు గృహనిర్మాణ మండలి ఛైర్మన్‌ రమేష్‌రెడ్డి, ఇన్‌ఛార్జి జాయింట్‌ డైరెక్టర్‌ సి.అనసూయ, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, నర్మద, ఓఎస్‌డీ(అడ్మిన్‌) రాఘవరావు, పీటీసీ ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు