22 ఎకరాల్లో ‘స్వర్ణగిరి’ శ్రీవేంకటేశ్వర ఆలయం

మానేపల్లి కుటుంబం, మానేపల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మితమైన ‘స్వర్ణగిరి’ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు.

Published : 23 Feb 2024 03:44 IST

భువనగిరిలో నిర్మించిన మానేపల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌
6న చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మానేపల్లి కుటుంబం, మానేపల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మితమైన ‘స్వర్ణగిరి’ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు. తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామని.. మార్చి 1 నుంచి 6వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ అధినేత మానేపల్లి రామారావు తెలిపారు. 6వ తేదీ ఉదయం 11:06 గంటలకు త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు నుంచే భక్తుల దర్శనాలు మొదలవుతాయన్నారు. స్థపతి డీఎన్‌వీ ప్రసాద్‌ మాట్లాడుతూ అద్భుత శిల్పకళతో ‘యాదాద్రి తిరుమల దేవస్థానం’ పేరుతో ఈ ఆలయం రూపుదిద్దుకుందన్నారు. 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం, 12 అడుగుల ఎత్తైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహం సిద్ధమైనట్లు వివరించారు. 40 అడుగుల ఎత్తయిన రథంతో పాటు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలు నిర్మితమైనట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు