రాష్ట్ర సహకార బ్యాంకులకు టెస్కాబ్‌ ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) దేశంలోని ఇతర రాష్ట్ర బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్‌స్కాబ్‌) అధ్యక్షుడు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

Published : 23 Feb 2024 03:44 IST

సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య అధ్యక్షుడు రవీందర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) దేశంలోని ఇతర రాష్ట్ర బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్‌స్కాబ్‌) అధ్యక్షుడు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. బెంగళూరులో నాఫ్‌స్కాబ్‌ ఆధ్వర్యంలో స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థ, వ్యాపార ప్రణాళిక విస్తరణపై భారత్‌కాల్‌ ప్రాంతీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార సేవాదృక్పథం, రైతు ప్రయోజనాలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌ అంతర్గత విధానాలతో తమ బ్యాంకు పురోగమించిందన్నారు.  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సహకార మంత్రి రాజయ్య, నాఫ్‌స్కాబ్‌ ఎండీ సుబ్రహ్మణ్యం, టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు