కనువిందు చేస్తున్న కవలలు

కవలలను ఒక చోట ఒక జంటనో లేదా రెండు, మూడు జంటలనో చూస్తుంటాం. అలాంటిది నిజామాబాద్‌ జిల్లాలోని చందూర్‌ మండల కేంద్రంలోని విక్టరీ పాఠశాలలో ఎల్‌.కె.జి మొదలుకొని 9వ తరగతి వరకు మొత్తం 19 కవల జంటలున్నాయి.

Published : 23 Feb 2024 04:20 IST

కవలలను ఒక చోట ఒక జంటనో లేదా రెండు, మూడు జంటలనో చూస్తుంటాం. అలాంటిది నిజామాబాద్‌ జిల్లాలోని చందూర్‌ మండల కేంద్రంలోని విక్టరీ పాఠశాలలో ఎల్‌.కె.జి మొదలుకొని 9వ తరగతి వరకు మొత్తం 19 కవల జంటలున్నాయి. మొత్తం 38 మంది చిన్నారులు రోజూ పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులను తికమకపెడుతూ సందడి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ‘న్యూస్‌టుడే’ కవలల దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం, పిల్లలతో ముచ్చటించింది. ఇంతమంది కవలలు తమ బడిలో చదువుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల యాజమాన్య ప్రతినిధి కొడాలి రామచంద్రరావు చెప్పారు.

న్యూస్‌టుడే, వర్ని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని