రెండు రాష్ట్రాల అధికారులతో కేఆర్‌ఎంబీ సభ్యుల సమీక్ష

రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులతో కేఆర్‌ఎంబీ సభ్యులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సాగర్‌ డ్యాం నిర్వహణ పనుల విషయంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య విభేదాలు వస్తుండటంతో కేఆర్‌ఎంబీ సభ్యులు ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ శివశంకరయ్య డ్యాంను కేత్రస్థాయిలో పరిశీలించారు.

Published : 24 Feb 2024 02:59 IST

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులతో కేఆర్‌ఎంబీ సభ్యులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సాగర్‌ డ్యాం నిర్వహణ పనుల విషయంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య విభేదాలు వస్తుండటంతో కేఆర్‌ఎంబీ సభ్యులు ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ శివశంకరయ్య డ్యాంను కేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కుడికాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్ల నిర్వహణ పనులను తమకే అప్పగించాలని ఏపీ అధికారులు డిమాండ్‌ చేయగా, తెలంగాణ అధికారులు ఇప్పటి వరకు డ్యాం పూర్తిస్థాయి నిర్వహణ తామే నిర్వహించామని, దానిని యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేఆర్‌ఎంబీకి నివేదికగా అందిస్తామని సభ్యులు తెలిపారు. ఈ సమీక్షలో ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డీఈలు సుదర్శనరావు, శ్రీనివాసు, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని