అనధికారికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

అనధికారికంగా సరఫరా నిలిపివేసి పనులు చేపట్టిన ముగ్గురు విద్యుత్‌శాఖ ఉద్యోగులు సస్పెండయ్యారు.

Published : 24 Feb 2024 03:02 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: అనధికారికంగా సరఫరా నిలిపివేసి పనులు చేపట్టిన ముగ్గురు విద్యుత్‌శాఖ ఉద్యోగులు సస్పెండయ్యారు. కొండాపూర్‌ డివిజన్‌లో అల్లాపూర్‌ సెక్షన్‌ పరిధిలోని అయ్యప్పసొసైటీ ఉపకేంద్రంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నర్సింహ, జూనియర్‌ లైన్‌మెన్‌లు విజయ్‌, దస్రు శుక్రవారం సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీలో అనధికారికంగా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సంబంధించిన విద్యుత్‌ తీగల మార్పిడి పనులు చేపట్టారు. ఈ విషయమై శాఖ సీఎండీకి ఫిర్యాదు అందడంతో.. వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురినీ సస్పెండ్‌ చేసినట్లు కొండాపూర్‌ డీఈ గరుత్మంత్‌రాజు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని