చేవెళ్ల నుంచే పథకం ప్రారంభం?

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

Published : 24 Feb 2024 03:08 IST

చేవెళ్ల, న్యూస్‌టుడే: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. అదే ఆనవాయితీ కొనసాగిస్తూ రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ పథకాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా కళాశాల మైదానాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శశాంకతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. 27న సాయంత్రం బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు