మూడుసార్లు జాతరకు రావడం నా అదృష్టం: గవర్నర్‌ తమిళిసై

మేడారానికి గవర్నర్‌ హోదాలో మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నాని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. శుక్రవారం ఆమె కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ ముండాతో కలిసి మేడారం మహాజాతరకు వచ్చారు.

Published : 24 Feb 2024 03:17 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: మేడారానికి గవర్నర్‌ హోదాలో మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నాని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. శుక్రవారం ఆమె కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ ముండాతో కలిసి మేడారం మహాజాతరకు వచ్చారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు. గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ గిరిజన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను, ఆదివాసీ, గిరిజన తెగలను నేను ఎంతో ప్రేమిస్తానని, రాష్ట్రంలోని ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్నారు. 

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర...

దేశంలోనే మేడారం అతిపెద్ద గిరిజన జాతర అని... ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ ముండా అన్నారు. దేశ అభ్యున్నతిలో ఆదివాసీ గిరిజనులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి దేశంలోని ఆదివాసీ గిరిజనులు తెలుసుకోవాలని, వారందరూ అమ్మవార్లను దర్శించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ప్రత్యేక నోడల్‌ అధికారులు ఆర్వీ కర్ణన్‌, కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ శబరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని