నేర నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం

నేర నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఐఐటీఏ)లో శుక్రవారం ‘23వ పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌’ పరేడ్‌ నిర్వహించారు.

Updated : 24 Feb 2024 06:05 IST

‘23వ పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌’ పరేడ్‌లో డీజీపీ రవిగుప్తా 

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: నేర నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఐఐటీఏ)లో శుక్రవారం ‘23వ పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌’ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ రవిగుప్తా జాగిలాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల జాతీయస్థాయి డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసులు వరుసగా పతకాలు సాధించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం తెలంగాణకే గర్వకారణమన్నారు. ఐఐటీఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందన్నారు. పోలీసుశాఖ విజయాలలో పోలీసు జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్రను నిర్వహించాయని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. పలు రాష్ట్రాల జాగిలాలకు ఇక్కడే శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఐజీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. 21 జాగిలాలు, 28 మంది కెనైన్‌ హ్యాండర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎం.రమేష్‌, ఆర్పీఎఫ్‌ ఐజీపీ అరోనాసింగ్‌ ఠాకూర్‌, ఎస్‌జడ్‌ ఖాన్‌, భాస్కరన్‌, రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌, ఐఐటీఏ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ అరవిందరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని