ఇలా ఆగితే.. జీవితాలు ఆగమాగమే

ఔటర్‌ రింగురోడ్డుపై శంషాబాద్‌ సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల వరస ఇది. విశాలమైన ఈ మార్గంలో గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్తుంటాయి.

Published : 24 Feb 2024 06:42 IST

టర్‌ రింగురోడ్డుపై శంషాబాద్‌ సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల వరస ఇది. విశాలమైన ఈ మార్గంలో గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్తుంటాయి. ఇలా రహదారి వెంబడి నిలిపిన  వాహనాలను ఢీకొట్టడంతో ఈ రహదారి నిత్యం రక్తంతో తడుస్తోంది. ఏవైనా సమస్యలుంటే వాహనాలు పక్కకు నిలిపి ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రహదారిపైనే భారీ వాహనాలను సైతం నిలిపేస్తున్నారు. పర్యవేక్షణ లోపం కూడా తోడవ్వడంతో ఔటర్‌పై ఈ తరహా ప్రమాదాలు పరిపాటిగా మారాయి.

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని