Sangareddy: హామీని మరచిన అధికారులు.. బడికి తాళం వేసిన రైతు

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో పాఠశాల నిర్మాణానికి రైతు మర్కల్‌ బక్కన్న నుంచి 2001లో ప్రభుత్వం 10 గుంటల భూమిని తీసుకుంది.

Updated : 27 Feb 2024 07:56 IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో పాఠశాల నిర్మాణానికి రైతు మర్కల్‌ బక్కన్న నుంచి 2001లో ప్రభుత్వం 10 గుంటల భూమిని తీసుకుంది. దీనికి బదులుగా వేరే ప్రాంతంలో అదే విస్తీర్ణంలో భూమి కేటాయిస్తామని నాడు అధికారులు హామీ ఇచ్చారు. 23 ఏళ్లయినా ఆ హామీ నెరవేరకపోవడంతో.. ఓపిక నశించిన ఆ రైతు సోమవారం బడికి తాళం వేశారు. ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక అద్దె గదుల్లో ఉంటున్నట్లు బక్కన్న, ఆయన కుమారుడు, కోడలు తెలిపారు. న్యాయబద్ధంగా తమకు మరోచోట పది గుంటల భూమి కేటాయించేవరకు తాళం తీయబోమని స్పష్టంచేశారు. అధికారులు వచ్చి నచ్చజెప్పినా తాళాలు ఇవ్వలేదు.  

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని