HYD News: ఓయూకు పూర్వ విద్యార్థి రూ.5కోట్ల భారీ విరాళం

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూర్వ విద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

Updated : 27 Feb 2024 07:31 IST

లాలాపేట, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూర్వ విద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించారు. 1968లో ఓయూలో ఆయన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. సెమినార్‌ హాల్‌కు ప్రొ.వి.ఎం.గాడ్గిల్‌ ఆడిటోరియంగా, కమ్యూనిటీహాల్‌కు ప్రొ.అబిద్‌ అలీ పేర్లను పెట్టాలని సూచించారు. విరాళం అందించిన కృష్ణను వీసీ ప్రొ.రవీందర్‌ అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.చంద్రశేఖర్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఓఎస్డీ ప్రొ.రెడ్యానాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని