4న ఆదిలాబాద్‌, 5న సంగారెడ్డి.. రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 4వతేదీ ఆదిలాబాద్‌లో, 5న సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Published : 29 Feb 2024 05:16 IST

 పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు.. సభలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 4వతేదీ ఆదిలాబాద్‌లో, 5న సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగ్‌పుర్‌ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కణ్నుంచి బయల్దేరి తమిళనాడుకు వెళ్తారు. అక్కడి కార్యక్రమాలు ముగించుకుని.. అదే రోజు రాత్రి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 5న ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి సంగారెడ్డికి చేరుకుంటారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కార్యక్రమాలు ముగించుకుని ఒడిశా వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని