ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ

రాష్ట్రంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 29 Feb 2024 02:56 IST

గ్రేటర్‌తోపాటు అన్ని పురపాలికల్లో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిశోర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డీ మాఫీ కోసం ఏక మొత్తం పరిష్కార (వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌) పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తాం. 2023 ఆర్థిక సంవత్సర బకాయిలను వడ్డీతో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా చెల్లించిన పక్షంలో ఆ 90 శాతం వడ్డీ రాయితీ మొత్తాన్ని తరవాత సంవత్సరం చెల్లించాల్సిన ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు