Karimnagar: శెభాష్‌.. పోలీస్‌!.. 2 కి.మీ. భుజాన మోసి..

పొలం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అతన్ని ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంతో శ్రమకోర్చి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

Published : 29 Feb 2024 07:13 IST

పురుగులమందు తాగిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్‌

వీణవంక, న్యూస్‌టుడే: పొలం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అతన్ని ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంతో శ్రమకోర్చి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఏకంగా 2 కిలోమీటర్లు అతన్ని భుజాన మోసి తీసుకెళ్లారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్‌ ఇంట్లో గొడవ పడి పొలం వద్ద బుధవారం పురుగుల మందు తాగాడు. అక్కడ ఉన్నవారు గమనించి 100కు సమాచారం ఇవ్వగా బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ జయపాల్‌, హోమ్‌గార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్‌ను జయపాల్‌ భుజాన వేసుకుని సుమారు 2 కిలోమీటర్లు పొలాల గట్ల మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి కుటుంబసభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌, ఇతర సిబ్బందిని ఎస్‌ఐ వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని