మద్యం మత్తులో ప్రయాణం ప్రాణాంతకం

మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకంగా మారుతోందని, దీన్ని నివారించేందుకు పోలీసుశాఖ శాయశక్తులా కృషి చేస్తోందని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.

Published : 29 Feb 2024 03:17 IST

డీజీపీ రవిగుప్తా

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకంగా మారుతోందని, దీన్ని నివారించేందుకు పోలీసుశాఖ శాయశక్తులా కృషి చేస్తోందని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. డియాజియో అనే సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా పోలీసుశాఖకు 50 అత్యాధునిక బ్రీత్‌ ఎనలైజర్లను బుధవారం హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీకి అందించింది. ఈ సందర్భంగా రవిగుప్తా మాట్లాడుతూ బ్రీత్‌ ఎనలైజర్లు వాడి, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి ప్రమాదాలు నివారించాలని అన్నారు. కార్యక్రమంలో  రైల్వే రహదారి భద్రత అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌, రహదారి భద్రత ఎస్పీ గోనె సందీప్‌, డియాజియో ప్రతినిధులు రవివర్మ, అశ్వత్‌ భైసాని, కె.జైకృష్ణ, రజత్‌ సరోహ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని