అయిదుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలో అయిదుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది.

Published : 29 Feb 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అయిదుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావును జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఉన్న స్నేహ శబరీష్‌ను కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ను హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

41 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం

లోక్‌సభ ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్రంలో 41 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లతోపాటు డిప్యూటీ కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 40 మందికి వివిధ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇవ్వగా.. డిప్యూటీ కలెక్టర్‌ కేతావత్‌ రామకృష్ణను మాత్రం తదుపరి పోస్టింగ్‌ కోసం రెవెన్యూశాఖలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని