సుప్రీంకోర్టులో కవిత కేసు 13కి వాయిదా

దిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్‌చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కి వాయిదా వేసింది.

Published : 29 Feb 2024 03:19 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్‌చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ కేసు బుధవారం నాటి లిస్ట్‌లో ఉన్నప్పటికీ మిగతా కేసుల విచారణ సుదీర్ఘంగా సాగడంతో ఇది రీచ్‌ కాలేకపోయింది. దీంతో చివరలో కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తమ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది సానుకూలంగా స్పందిస్తూ 13వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని