వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నరసింహమూర్తి

విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడిగా భోజనపల్లి నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అయోధ్యలో జరిగిన వీహెచ్‌పీ అఖిల భారత సమావేశాల్లో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 29 Feb 2024 03:23 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడిగా భోజనపల్లి నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అయోధ్యలో జరిగిన వీహెచ్‌పీ అఖిల భారత సమావేశాల్లో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఎస్సీ, బీఎల్‌ చదివిన ఆయన దశాబ్దకాలం(1984-1994) రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రచారక్‌గా పని చేశారు. వీహెచ్‌పీ భాగ్యనగర్‌ క్షేత్ర (ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు) సంఘటన మంత్రిగా గుమ్మల్ల సత్యం, బజరంగ్‌దళ్‌ భాగ్యనగర్‌ క్షేత్ర సంయోజక్‌గా కుమారస్వామి నియమితులైనట్లు వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్‌ పి.బాలస్వామి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని