కృష్ణా, గోదావరి నదుల కాలుష్య నివారణకు ప్రణాళిక

కృష్ణా, గోదావరి నదులతో పాటు దేశంలోని ఆరు ప్రధాన నదుల పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ తయారీ కోసం కేంద్ర జల్‌శక్తిశాఖ దేశంలోని 12 ప్రఖ్యాత విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.

Published : 29 Feb 2024 03:30 IST

ఎన్‌ఐటీ వరంగల్‌, హైదరాబాద్‌ ఐఐటీలతో కేంద్ర జలశక్తిశాఖ ఒప్పందం

ఈనాడు, దిల్లీ: కృష్ణా, గోదావరి నదులతో పాటు దేశంలోని ఆరు ప్రధాన నదుల పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ తయారీ కోసం కేంద్ర జల్‌శక్తిశాఖ దేశంలోని 12 ప్రఖ్యాత విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. బుధవారం కేంద్రజలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కృష్ణా నదీ పరివాహక ప్రాంత మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలను వరంగల్‌, సూరత్కల్‌ ఎన్‌ఐటీలకు, గోదావరి నది బాధ్యతలను హైదరాబాద్‌ ఐఐటీ, నీరి(నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)నాగ్‌పుర్‌కు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని