త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు: పొంగులేటి

ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, రేషన్‌ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.

Updated : 29 Feb 2024 09:03 IST

కూసుమంచి, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, రేషన్‌ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యల్లోనే రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియం, తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్లతో గిరిజన మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా అమలుచేసి తీరతామన్నారు. ధరణిలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని